Tour Festivals - పర్యాటక పండుగలు


పండుగలంటే దసరా, దీపావళిలే కాదు.. పండుగలంటే చాలా పండుగలున్నాయి. సాంప్రదాయ పండుగలు కొన్ని సాంస్కృతిక పండుగలు ఇంకొన్ని, పర్యావరణ పండుగలు కొన్నయితే, సాహిత్య పండుగలు ఇంకొన్ని.. ఇలాగే పర్యాటక పండుగలు కూడా జరుగుతాయి. మనకు తెలియని ఆ పండుగలేంటో చూద్దామా..

Image result for festivals india

భారతదేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక సాంస్కృతిక సంగీత పండుగలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని మతాలకు సంబంధించినవి అయితే ఇంకొన్ని కులాకు సంబంధించినవి. కొన్ని ప్రాంతాలకు సంబంధించినవి అయితే మరిన్ని వైవిధ్యాలకు సంబంధించినవి. అయితే ఈ ఉత్సవాలు ఉత్సాహాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందుకోసం విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సీజన్లను బట్టి రంగురంగుల అలంకరణలు చేసుకొని ఆకర్షిస్తుంటాయి. ప్రయాణాలను వివరించాలంటే, విశ్లేషించాలంటే అవి చేసి ఉండాలి. ప్రయాణాలు చేసేవాళ్లు తమ జీవితాన్ని సునాయసంగా బతికేస్తారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మానవ జీవితంలో ప్రయాణమనేది అతి ఉత్తేరపరిచే అంశంగా కూడా పలువురు అభిప్రాయపడ్డారు. 

01 - దుంగరి మేళ, మనాలి
Related image
భూతల స్వర్గంగా పిలిచే మనాలిలో ఏడాది మొత్తం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అక్కడ నిత్యం పర్యాటకుల రద్దీతో పండుగ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మనాలీలో జరిగే దుంగరి మేళలో సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరుస్తాయి. మంచుకురుస్తుంటే కొండప్రాంతాల్లో ఉండే ప్రజలు అంతా ఏకమై జరిపే ఈ పండుగకు అతిథులు వేల సంఖ్యలో వస్తుంటారు. దుంగరి అడవిలో ఉండే హదింబా అమ్మవారి జాతరకు పర్యాటకులు కిక్కిరిసిపోతారు.

02 - కొట్టియూర్ ఉత్సవం, కేరళ
అందమైన అటవీప్రాంతంలో ప్రయాణం చేస్తుంటే రోడ్ల పక్కల ఏనుగులు, జింకలు పరుగెడుతుంటాయి.దట్టమైన అడవిలో ఉండే ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా గుడిగంటలు మోగుతుంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతారు అక్కడికి వెళ్లిన వాళ్లు. బెంగళూరు, మైసూర్ నుంచి వెళ్లే సందర్శకులు ఎక్కువ కనిపిస్తారు. వైశాఖ మహోత్సవంగా పిలువబడే ఈ పండుగ మే నుంచి జూన్ మధ్య కాలం వరకు జరుగుతుంది. సమ్మర్ హాలీడేస్‌లో వెళ్లేవాళ్లు కొట్టియూర్ ఉత్సవాలకు వెళ్తే మరిచిపోలేని మధురానుభూతిని పొందుతారు.

03 - సమ్మర్ ఫెస్టివల్, ఊటి
Ooty, Green, Mountain, Nature, Railway, Agriculture
మంచు కొండల మధ్య జరిగే ఊటి సమ్మర్ ఫెస్టివల్ ఎవర్‌గ్రీన్ ప్రకృతి పండుగ. విదేశీయులు, ఊటి చుట్టుపక్కల ఉండే అడవిబిడ్డలు ఈ పండుగలో ఎక్కువ పాల్గొంటారు. అడవుల్లో పండించిన పంటలను అక్కడ అమ్మకానికి ఉంచుతారు. ప్రకృతి ఇచ్చే అరుదైన జాతి పండ్లు, కాయలు, మొక్కలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. మే నెల మొత్తం జరిగే ఈ సమ్మర్ ఫెస్టివల్‌లో రోజూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది.

04 - పోలో ఫెస్టివల్,లడఖ్
Related image
ఇదొక క్రీడా ఉత్సవం. జూలై 11న ప్రారంభం అయి 17న ముగుస్తుంది. ఆరవ లడఖ్ పోలో ఫెస్టివల్‌లో ఈసారి గుర్రపు పందాలతో పాటు జానపద నృత్య సంగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఆర్చరీ వంటి పోటీలను నిర్వహించనున్నారు. చుట్టూ మంచు పర్వతాలు మధ్యలో ఉన్న చుసోత్ గ్రామంలో ఈ క్రీడా పండుగ జరుగనున్నది. మైనస్ డిగ్రీల చలిలో గుర్రాలు పరుగెడుతుంటాయి.

05 - సాగ దావ, సిక్కిం
టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం నాలుగో నెలలో జరిగే ఈ ప్రకృతి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. జూన్ 17న ప్రారంభం కానున్న సాగ దావ ఉత్సవాలను సర్వం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. సాఖ్యముని పుట్టిన సందర్భంగా ఈ పండుగను జరుపుతారు. ఈ నెలలో మాంసం తినకుండా జంతువులను చంపకుండా నిష్ఠతో పవిత్రంగా ఉంటారు. కొందరు పావురాలను గాల్లోకి ఎగురవేసి శాంతిని కోరుతారు. ఈ నెలలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే పాపాలన్నీ పోతాయని వారి నమ్మకం. మొక్కులు ఉన్నవారు రంగు రంగుల బట్టలతో తయారు చేసిన జెండాలను కడతారు.

06 - సమ్మర్ ఫెస్టివల్, షిమ్లా
Image result for shimla summer festival 2019
వేసవిలో విరామం కోరుకునే వాళ్లు షిమ్లాకు వెళ్లి తీరాలి. ఎండాకాలంలో అక్కడ జరిగే పలు ఉత్సవాలు దేశం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులు ఇక్కడ సేదతీరుతారు. 19వ శతాబ్దం నాటి చర్చిలను చూసి ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా షిమ్లాలో సమ్మర్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే ఆహారం ఇంకెక్కడా లభించదు. షిమ్లాలో ఉండే కట్టడాలు, ఎత్తైన కొండలు, జలపాతాలు, ఆలయాలను సందర్శించాలంటే ఒక్కరోజు చాలదు. కేవలం షిమ్లా కాకుండా చుట్టు పక్కల ఉండే దర్శనీయ ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.

Comments