తక్కువ లగేజీతోనే..

కొత్త ప్రదేశాల్లో విహరించడం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. అయితే పర్యటన ఇబ్బందులు లేకుండా, ఆనందంగా సాగిపోవాలంటే వీలైనంత తక్కువ లగేజీ తీసుకెళ్లాలి. యాత్రకు అవసరమైన వస్తువులు సర్దుకుంటే మోయాల్సిన బరువు కూడా తగ్గుతుంది. యాత్రలకు, హాలీడేకు వెళ్లేవారు గుర్తించుకోవాల్సినవి...

ప్యాకింగ్‌ లిస్ట్‌: 
  • పర్యటన సమయంలో ఎక్కువ లగేజీ అవసరమనుకుంటారు చాలామంది. అయితే తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన దుస్తులు, ఇతరత్రాల జాబితా ముందే రెడీ చేసుకోవాలి. 
  • కావాలంటే ఆన్‌లైన్లో సింపుల్‌ ప్యాకింగ్‌ లిస్ట్స్‌ లభిస్తాయి. వాటిని చూసైనా సరిపడా సర్దుకోవచ్చు.

 సరైన బ్యాగ్‌: 

  • ఇరుకైన బ్యాగుల్లో లగేజీ నింపేయడం ద్వారా మరింత బరువుగా అనిపిస్తుంది. 
  • రెండు రోజుల పర్యటన లేదా షార్ట్‌ ట్రిప్‌ అయితే ట్రాలీ బ్యాగు బదులు తేలికగా ఉండే బ్యాగు ఎంచుకుంటే బెటర్‌.

 దుస్తులు: 

  • అవసరానికి మించి ఎక్కువ దుస్తులు ప్యాక్‌ చేయడం, వార్డ్‌రోబ్‌లోని వస్త్రాలన్నిటినీ బ్యాగులో నింపేయడం సరికాదు. 
  • తేలికైన దుస్తులు ఎంచుకుంటే తక్కువ స్థలం చాలు. లగేజీ బరువు కూడా తగ్గుతుంది.

 ఫుట్‌వేర్‌: 

  • రెండు మూడు జతల చెప్పులు కాకుండా ఫార్మల్‌, ఇన్‌ఫార్మల్‌ ఫుట్‌వేర్‌ తీసుకెళ్తే మంచిది. 
  • షూ బ్యాగు బదులు షవర్‌ క్యాప్స్‌ సౌకర్యంగా ఉంటాయి. వీటిని కొద్ది స్థలంలోనే సర్దేయొచ్చు.

Comments