Take Care - వర్షాకాల జాగ్రత్తలు

వర్షాకాలం వచ్చేస్తోంది. నిన్న, మొన్నటి వరకూ వేసవి సెలవుల్లో టూర్‌కు వెళ్లిన వారు కొందరైతే, మాన్‌సూన్‌ ట్రిప్‌కు సిద్ధమవుతున్న వారు మరికొందరు. ప్రకృతి ప్రేమికులను సీజన్‌ టూరిజం ప్యాకేజీలూ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే వానలు మొదలవడంతో నగర వాతావరణమూ చల్లబడింది. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

టూర్‌కు వెళ్లే ముందు..
  • బస్సులు, కార్లలో వెళ్తే గొడుకు తప్పనిసరిగా తీసుకెళ్లండి.
  • బైక్‌పై వెళ్తే రెయిన్‌కోట్‌తోపాటు హెల్మెట్‌ వాడండి.
  • ఇంటి నుంచి బయల్దేరే ముందే గొడుగు, రెయిన్‌కోట్‌, క్యాప్‌, హెల్మెట్‌ చెక్‌ చేసుకోవాలి.
  • సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌ ల కోసం ప్లాస్టిక్‌ కవర్‌ అందుబాటులో ఉంచుకోండి.
  • వర్షాకాలంలో వాటర్‌ప్రూఫ్‌ చెప్పులు, షూ వాడాలి.
  • బయటకు రెగ్జిన్‌ బ్యాగులు తీసుకెళ్లడం మంచిది.
ఇంట్లో ఇలా...
  • కరెంటు పోయిన వెంటనే టీవీ, ఫ్రిజ్‌, కంప్యూటర్‌ ఇతరత్రా ఎలక్ర్టానిక్‌ పరికరాలను ఆఫ్‌ చేయాలి.
  • ఇంటి మీద పిడుగు పడకుండా కాపర్‌ వైర్‌తో సెక్యూర్‌ చేయించాలి.
  • కరెంటు మన ఇంట్లోనే పోయిందా, అంతటా పోయిందా తెలుసుకోవాలి. మన ఇంట్లోనే అయితే ట్రాన్స్‌కో వాళ్లకు ఫిర్యాదు చేయాలి.
  • వర్షం పడేటప్పుడు తలుపులు తెరిచి ఉంచకండి. చల్లటిగాలి ఒకేసారి తగలడం వల్ల జ్వరాల బారిన పడే అవకాశం ఉంది.
దుస్తులు ఎలా అంటే...
  • షార్ట్‌లెంత్‌ దుస్తులు వేసుకోవడం ఉత్తమం.
  • మరీ వదులుగా ఉండే దుస్తులు ఈ సీజన్‌లో వేసుకోకూడదు.
  • ఏసీ గదుల్లో తడి దుస్తులు వేయకండి.
  • తడిగా ఉన్న దుస్తులు వేసుకుంటే ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి గనుక అలా చేయకండి.
ఆహారం...
  • వర్షం వల్ల వాతావరణం చల్లగా ఉందని, రోడ్డు వెంట బండ్లపై కనిపించే వేడివేడి మిర్చీలు, పకోడీల జోళికి వెళ్లొద్దు. వాళ్లు వాడే నూనె, పిండి నాణ్యమైనవి కాకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. డయేరియా, కామెర్లు, కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆహార పదార్ధాలు తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం.
  • ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా జాగ్రతలు తీసుకోవాలి.
  • పండ్లు, కూరగాయాలను నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాత వాడుకోవాలి.
  • సులభవంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • నాన్‌వెజ్‌ తక్కువ తీసుకోవాలి.
  • అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సోంపు, వంటివి తొందరగా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. వీటిని వాడే వంటలను ఎంచుకోండి.
  • వేడి చేసి, ఫిల్టర్‌ చేసిన నీటినే వాడాలి.
ఆరోగ్యం...
  • జలుబు, దగ్గు ఉంటే వర్షంలో తవడం, బయటకు వెళ్లడం వంటివి చేయకండి.
  • ఆస్తమా, డయాబెటిక్‌ బాధితులు మరింత జాగ్రతగా ఉండాలి. మందులు క్రమం తప్పకుండా వాడాలి.
  • హెర్బల్‌ చాయ్‌, యాంటీ బ్యాక్టీరియా ఉండే చాయ్‌ తాగాలి. అల్లం చాయ్‌ మరీ మంచిది.
అందం కోసం...
  • వర్షాకాలంలో వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ కిట్లు ప్రత్యేకంగా దొరుకుతాయి. వాటిని వాడితే మంచిది.
  • మేకప్‌ వేసుకునే వారు ముఖాన్ని బాగా కడుక్కొని మాయిశ్చర్‌ రాసుకుని మేకప్‌ వేసుకోవాలి. లేదంటే వర్షానికి మేకప్‌ పోతుంది.
  • కళ్లకు వాడే కాటుక కూడా వాటర్‌ ప్రూఫ్‌ అయితే బెటర్‌.
  • చేతులు కడగకుండా కళ్లు రుద్దొద్దు.
  • ముఖాన్ని టవల్‌తో తూడిచినట్లుగా కళ్లను తూడవొద్దు. మొత్తటి క్లాత్‌తో కళ్లకు అద్దుకుని తడిని పోగొట్టాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ ఉంటే మరింత జాగ్రతగా ఉండాలి.
  • బయటి నుంచి ఇంటికి రాగానే మొహం కడుక్కోవాలి.
  • లిప్‌స్టిక్‌ విషయంలో పెదాలకు సీజనల్‌ కలర్స్‌తోపాటు రోజ్‌ పింక్‌, రెడ్‌ కలర్‌ బాగా సెట్‌ అవుతాయి.
  • జుట్టుకు వారానికి రెండు సార్లు ఆలీవ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయాలి. స్నానానికి రెండు గంటల ముందు అప్లయ్‌ చేస్తే చాలు.
  • వెంట్రుకలు ఎక్కువసేపు తడిగా ఉండకుండా చూసుకోండి.
  • నగలు ఎంత తక్కవగా ధరిస్తే అంత మంచిది. వర్షంలో అసలు ధరించకపోవడం ఉత్తమం.
  • లెదర్‌ రిస్ట్‌ వాచ్‌ల కన్నా, స్టీల్‌ బెల్ట్‌ ఉన్నవి వాడాలి.

Comments