ప్రయాణం.. ఒత్తిడి దూరం


డిప్రెషన్ తగ్గాలంటే చాలా మంది చేసేది ప్రయాణం. ఈ విషయం చాలామందికి తెలిసినా నిర్లక్షం వల్ల పట్టించుకోరు. ప్రయాణం చెయ్యడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.వాటిలో కొన్ని....

  • ఒంటరిగా ఉన్నప్పుడే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. 
  • చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 
  • ప్రయాణాలు చేయడం వల్ల డిప్రెషన్‌కు వెళ్లే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కారణం ఎక్కువ మందిని కలుస్తుంటాం. 
  • ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుల నుంచి మొదలు డ్రైవర్, హోటల్ సిబ్బంది ఇలా కొత్త ముఖాలను చూసే అవకాశం ఉంటుంది. వారితో పరిచయం ఏర్పడి మాట్లాడే అవకాశం దొరికితే ఇంకా మంచిది.
  •  ప్రతి ఒక్కరికీ రకరకాల కథలుంటాయి. అవి పంచుకుంటే కొంత బాధ తగ్గుతుంది.
  • వెళ్లేదేదో ప్రకృతికి దగ్గరగా వెళ్తే ఇంకా మంచిది. దట్టమైన అడవులు, నదులు, పర్వతాలు, ప్రశాంతతనిస్తాయి.
  •  ప్రకృతికి దగ్గరయితే డిప్రెషన్ దానంతట అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదొక శక్తివంతమైన మార్గంగా చెప్పొచ్చు. 
  • వీలైతే ప్రయాణాల్లో ట్రెక్కింగ్, రాక్ ైక్లెంబింగ్, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను కలిగించే పనులు చేయండి. ఆరోగ్యంతో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది. 
  • నిద్ర కావాలంటే గాడ్జెట్స్‌కు దూరంగా ఉండండి. మీరు వెళ్లిన ప్రదేశం గురించి లోతుగా అధ్యయనం చేయండి.
కాబట్టి ఇక నుండి డిప్రెషన్ గా అనిపించినప్పుడు తప్పకుండా ఒక మంచి ప్రదేశానికి ఒంటరిగా కాని వీలయితే స్నేహితులతో గాని ప్రయాణం చేయండి.

Comments