వర్షంలో....జిల్ జిల్ జిగా

మాన్‌సూన్‌ టూరిస్టు కేంద్రాలకు... భలే డిమాండ్‌
మన దేశంలో June నుంచి September వరకూ మాన్‌సూన్‌ సీజన్‌గా పరిగణిస్తారు. ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణం ఇది. అందుకే ఈ సీజన్‌లో ఎక్కువుగా టూర్లకు వెళ్తుంటారు. మాన్‌సూన్‌లో ఏయే ప్రదేశాలకు టూరిస్ట్‌లు ఎక్కువుగా వెళ్తుంటారు.. ఆ ప్రాంతాల ప్రత్యేకతలపై Special Story..

గోవా.. మ్యాజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌

గోవాకు వేసవి కాలంలో ఎంత డిమాండ్‌ ఉంటుందో మాన్‌సూన్‌లోనూ అలాగే ఉంటుంది. ఈ సీజన్‌లోనే గోవా నిజమైన అందాలు కనిపిస్తాయనేది ప్రకృతి ప్రేమికుల మాట. అందమైన పచ్చిక బయళ్లు, రకరకాల పువ్వులు, కొత్తనీరు, సాయంత్రం సమయంలో మాండోవి నదిలో క్రూయిజ్‌ పర్యటన, బీచ్‌లో వర్షం మ్యాజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటున్నారు పర్యాటకులు

కేరళ.. కపుల్స్‌ బెస్ట్‌ ప్లేస్‌..


వర్షాకాలంలో కేరళకు వెళ్లడానికి హనీమూన్‌ కప్పుల్స్‌ అధికంగా ఇష్టపడతారు. అక్కడ జరిగే రకరకాల ఫెస్టివల్స్‌, బాగా కారంగా వండే వంటలు, బ్యాక్‌ వాటర్‌, వర్షంలో సైట్‌ సీన్స్‌ ఈ ప్రాంత ప్రత్యేకతలు. అందుకే వర్షాకాలంలో కేరళ టూరిజానికి అధిక డిమాండ్‌ ఉంటుంది.

కూర్గ్‌.. గేట్‌ వే ఆఫ్‌ మాన్‌సూన్‌

మాన్‌సూన్‌ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా పిలిచే ప్రాంతం కుర్గ్‌. మైసూర్‌, బెంగుళూర్‌ నుంచే కాక, దేశ నలుమూలల నుంచీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ కాలంలో ఈ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. రకరకాల మొక్కలు, పువ్వులు, సెలయేరు, పడవ ప్రయాణం, సుగంధ ద్రవ్యాల మొక్కలు బాగా పరిమళిస్తాయి. దీంతో చాలా మంది కుర్గ్‌కు వర్షాకాలంలోనే వెళ్తారు.

లోనావాలా... వర్షం చూడాల్సిందే..

ఖండాలా అన్నా, లోనావాలా అన్నా ఒక్కటే. వర్షాకాలంలో ఈ హిల్స్‌ స్టేషన్‌పై నుంచి వర్షం నీరు పడుతుంటే చూడాల్సిందే. ఇక్కడ గ్రీనరీ అంతా ఇంత కాదు. కళ్లు తిప్పుకోలేమని పర్యాటకులు చెబుతుంటారు. మాన్‌సూన్‌లో ఇక్కడ రద్దీ అధికం. ముంబయికి దగ్గర కావడంతో వీకెండ్‌ బాగా బిజీగా ఉంటుంది ఈ పర్యాటక కేంద్రం.

లడక్‌

వేసవి పోయి వర్షాకాలం ఆరంభమయ్యే సమయంలో లడక్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయం బాగా గోల్డెన్‌ రంగులో ఉంటాయంట. దాంతో ప్రాంతం అంతా బంగారుమయంగా కనిపిస్తుం దట. చాలా మంది లడక్‌కు మాన్‌సూన్‌ సీజన్‌లో వెళ్లడానికి ఇష్టపడతారు. వర్షాకాలంలో లడక్‌ బై రోడ్డు వెళ్లడం వింత అనుభూతి అని పర్యాటకులు చెబుతున్నారు.

మరి కొన్ని ప్రదేశాలు

  • ఉదయ్‌పూర్‌ గ్రీనరీ వర్షాకాలంలో అద్భుతంగా ఉంటుంది. నెమళ్లు నృత్యాలు చేస్తాయంట. వీటిని చూసేందుకు భారీగా పర్యాటకులు వస్తారు.
  • గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం మాన్‌సూన్‌ సీజన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ మూడు నెలల పాటు రన్‌మహోత్సవ్‌ అనే జాతర సాగుతుంది. ఈ జాతరతో పాటు చల్లగా ఉన్న సమయంలో కచ్‌లాంటి ఎడారి ప్రాంతాన్ని సందర్శకులు ఆస్వాదిస్తారు.
  • ఉత్తరాఖండ్‌లోని అనేక ప్రాంతాలు హిమాలయాలను ఆనుకుని ఉండడంతో రకరకాల పువ్వులు చేసేందుకు పర్యాటకులు వెళ్తారు. అందుకే ఉత్తరాఖండ్‌ను ఫ్లవర్స్‌ వ్యాలీ అని కూడా అంటారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని డల్‌హౌజ్‌, మధ్య ప్రదేశ్‌లోని ఓర్చా దేవాలయం, షిల్లాంగ్‌ హిల్స్‌ స్టేషన్‌, కొడైకెనాల్‌, అమర్‌నాథ్‌ యాత్రలు మాన్‌సూన్‌లోనే మొదలవుతాయి.

Comments